కరోనా వైరస్‌పై రోజూ ఏదో ఓ పోస్ట్ పెడుతూనే ఉందిరష్మి. ఈ మధ్యే ఒకటి అలా పెట్టింది. కరోనా కారణంగా చాలా మంది ఆకలితో చచ్చిపోతున్నారు.. రోజూవారీ కూలీలతో పాటు బిక్షగాళ్లు కూడా అన్నం కోసం అలమటిస్తున్నారు.. దయచేసి అలాంటి వాళ్ళకు మీరు తోచిన సాయం చేయండి.. మీరు తినే అన్నంలో కాస్త వాళ్లకు కూడా సాయం చేస్తే అంతకంటే మరో మంచిపని ఇంకోటి ఉండదు అంటూ పోస్ట్ చేసింది రష్మి గౌతమ్. దీనిపై చాలా మంది ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఒక్కరు మాత్రం విమర్శలు చేసాడు. ముందు నువ్వు ఇలాంటి పోస్టులు పెట్టడం మానేసి.. నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్లకు పోయి సాయం చేయ్ అంటూ ఘాటుగానే కామెంట్ పెట్టాడు. అది చూసిన రష్మికి ఒళ్ళు మండిపోయింది. వెంటనే అతడికి రిప్లై ఇచ్చింది. నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకోండి.. కనీసం నువ్వు పెట్టుకున్న పేరుకు అయినా వ్యాల్యూ ఇవ్వు.. ఆ పేరు పరువు తీయొద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ కామెంట్ చేసిన వ్యక్తి పేరు కళ్యాణ్ పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ అభిమాని. దాంతో పవన్ పేరుకు చాలా విలువ ఉంది.. దాన్ని ఇలాంటి చీప్ కామెంట్స్ పెట్టి తీయొద్దని గట్టిగానే చెప్పింది రష్మి.
Meru first respect icchi tweets rayadum nercheko andi
Medi kakpote kanisam yeh hero Peru peti meru account run chestunro
Vala paruvu teyakandi https://t.co/dgcm8UnrAW— rashmi gautam (@rashmigautam27) March 28, 2020
ఇన్స్టెంట్ స్టోరీలు, డైలాగ్స్ వద్దు…టాలీవుడ్ డైరెక్టర్స్‌కి చిరు మందలింపు