సొంత గడ్డపై ముంబై టీం తడబడింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఆరో సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 2-4 గోల్స్ తేడాతో గోవా ఎఫ్‌సీ చేతిలో ఓడింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన గోవా ఎఫ్‌సీ సీజన్‌లో రెండో విజయాన్ని ఖాయం చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
గోల్స్ వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో గోవా ఆటగాళ్లలో లెన్ని రోడ్రిగస్ (27వ ని.), ఫెర్రాన్ కొరొమినస్ (45వ ని.), హ్యూగో బొవుమౌస్ (59వ ని.), కార్లోస్ పెన (89వ ని.) తలా ఓ గోల్ చేశారు. ముంబై తరఫున సార్థక్ గోలుయ్ (49వ ని.), సౌవిక్ చక్రబర్తి (55వ ని.) చెరో గోల్ సాధించారు.
టీడీపీకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యం: మంత్రి కన్నబాబు