telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అమెజాన్ లో వకీల్ సాబ్.. ఎప్పుడంటే..?

Vakeel-Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలై చక్కటి ఆదరణ పొందింది. కోవిడ్ సెకండ్ వేవ్ తో ప్రేక్షకులు థియేటర్లకు అంతగా రావటం లేదు. దీంతో చాలా వరకు థియేటర్లను మూసి వేశారు. దీంతో చాలా సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. ‘వకీల్ సాబ్’ కూడా ఓటీటీలో వస్తే మళ్ళీ చూడాలని పలువురు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అలాగే మే 1 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు ప్రకటించింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, నివేతా థామస్, అంజలి కీలక పాత్రలు పోషించగా పవన్ కి జోడీగా శ్రుతిహాసన్ కనిపించింది. ప్రకాష్ రాజ్ లాయర్ గా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు..

Related posts