telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వ్యాక్సిన్ పై రష్యా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు: డబ్ల్యూహెచ్ఓ

Corona Virus Vaccine

కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పనితీరుపై పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది.  ఈ వారం ప్రారంభంలో రష్యా రిజిస్టర్ చేసిన కరోనా వ్యాక్సిన్ సమర్థతపై తమ వద్ద ఎటువంటి సమాచారమూ లేదని స్పష్టం చేసింది.

రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీపై రష్యా కూడా ఎటువంటి సమాచారం అందించలేదని, అది ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఆ దేశంతో చర్చిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయల్వార్డ్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో 9 వ్యాక్సిన్లు ప్రయోగదశలో ముందున్నాయని, వాటిల్లో స్పుత్నిక్ లేదని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తయారీ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు.

Related posts