ఆక్సిజన్ కొరత, మందులు, వ్యాక్సిన్ల అంశాన్ని సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టిన సుప్రీం.. తాము డీల్ చేయాల్సిన జాతీయ సమస్యలు కొన్ని ఉన్నాయని.. ఇలాంటి సంక్షోభ సమయంలో కోర్టు ఓ ప్రేక్షకుడిలా కూర్చోలేదని వ్యాఖ్యానించింది. ఇక, ఈ విషయంలో హైకోర్టుల విచారణలకు మేం అడ్డుపడటం లేదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. వాటికి సహాయక పాత్రను సుప్రీంకోర్టు పోషిస్తోందంటూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ఎన్ రావ్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.. మరోవైపు.. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తామని తెలిపింది. కాగా, ఆక్సిజన్ కొతర, మందులు, వ్యాక్సిన్లపై గత వారం సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. కోవిడ్‌పై జాతీయ ప్రణాళికను సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.. అయితే, ఇవాళ కేంద్రం తమ ప్రణాళికను కోర్టుకు సమర్పించగా.. దానిని పరిశీలించిన తర్వాత శుక్రవారం మరోసారి విచారణ జరపనుంది సుప్రీం.
previous post
next post