telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ ఆసీస్ ఆగటగాళ్లు కూడా ఐపీఎల్ విడనున్నారా…?

భారత్ లో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులు పలువురు క్రికెటర్లకు భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి- విదేశీ ఆటగాళ్లు. కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక్కరొక్కరుగా జట్లను వీడుతున్నారు. స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఇదివరకు ఆండ్రూ టై, ఆ తరువాత స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్ధాంతరంగా ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నారు. ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్‌దీ అదే పరిస్థితి. , తాజాగా- ఆస్ట్రేలియాకే చెందిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా స్వదేశానికి తిరుగుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. స్టీవ్ స్మిత్ ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉంటున్నాడు. ఈ ముగ్గురు కూడా ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకోనే అవకాశాలు ఉన్నాయి. రోజూ లక్షల సంఖ్యలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం.. భారత్‌ నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశానికి చెందిన క్రికెటర్లందరూ స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు- రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియన్ అండ్రూ టై అర్ధాంతరంగా ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. తన స్వదేశానికి వెళ్లిపోయాడు. అదే జట్టుకు చెందిన మరో క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్ సైతం తన స్వదేశం ఇంగ్లాండ్‌కు తిరుగుముఖం పట్టాడు.

Related posts