telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రైవేట్ ఉద్యోగుల హక్కులను .. పరిరక్షిస్తాం .. : మంత్రి హరీష్‌రావు

harishrao on private employees rights

మంత్రి హరీష్‌రావు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు అంటేనే తెలంగాణ ఉద్యమ వేదికలుగా ఉండేవని గుర్తు చేశారు. నాడు జనవరి నెల మొత్తం కూడా డైరీలు ఆవిష్కరణ చేసేవాళ్లం అని తెలిపారు.

ఉద్యమ సమయంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసేవాళ్లమని చెప్పారు. 12 ఏళ్ల క్రితం ప్రైవేటు ఉద్యోగుల సంఘం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని హరీష్‌రావు గుర్తు చేశారు. ప్రైవేటు ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగుల హక్కులు కాపాడడం కోసం కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు.

Related posts