telugu navyamedia
సినిమా వార్తలు

బాలకృష్ణ టైటిల్ తో గోపీచంద్ ?

Gopichand

నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ హిట్ మూవీస్ లో ఒకటి “బంగారు బుల్లోడు”. 1993లో విడుద‌లైన ఈ సినిమాలో బాల‌కృష్ణ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్ జోడి క‌ట్టింది. ఇప్పుడు అదే టైటిల్‌తో హీరో గోపీచంద్ ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌నుకుంటున్నార‌ట‌. టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్ ప్ర‌స్తుతం తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని అనీల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బాల‌కృష్ణ హిట్ మూవీ “బంగారు బుల్లోడు” టైటిల్‌ను పెట్టాల‌నేది ద‌ర్శ‌క నిర్మాత‌ల ప్లాన్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమాలో గోపీచంద్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ జ‌రీనాఖాన్ నటిస్తోంది.

Related posts