telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టైలిష్ స్టార్ స్టెప్పులకు బాలీవుడ్ స్టార్ ఫిదా

AA

టాలీవుడ్‌లో డాన్సుల‌కు క్రేజ్ తీసుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న త‌ర్వాత నేటి త‌రం హీరోల్లో చాలా మంది డాన్సు ఇర‌గ‌దీస్తున్నారు. స్టెప్పులతో అభిమానుల చేత విజిల్స్ వేయిస్తున్నారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్సు‌కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. తాజాగా అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠ‌పురములో’ చిత్రంలో ఆయన స్టెప్పులకు సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ‘బుట్ట‌బొమ్మ’, ‘రాములో రాముల’ సాంగ్స్‌కు బాలీవుడ్ సెల‌బ్రిటీలు, వార్న‌ర్‌, పీట‌ర్స‌న్ వంటి క్రికెట‌ర్స్ టిక్‌టాక్ వీడియోలు చేసేస్తున్నారు. ఇప్పుడు మ‌రో బాలీవుడ్ స్టార్ కూడా అల్లు అర్జున్ డాన్స్‌లకు తాను పెద్ద అభిమానినని తెలిపాడు. ఆ బాలీవుడ్ స్టార్ ఎవ‌రో కాదు.. షాహిద్ క‌పూర్‌. ‘క‌బీర్‌సింగ్’ చిత్రంతో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్న షాహిద్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో మాట్లాడుతున్న‌ప్పుడు ఓ అభిమాని అల్లు అర్జున్ గురించి ఓ మాట‌లో చెప్పండి అని ప్ర‌శ్నించిన‌ప్పుడు ‘నేను త‌న డాన్సింగ్ స్కిల్స్‌ను ఇష్ట‌ప‌డ‌తాను’ అని షాహిద్ సమాధానం ఇచ్చారు.

Related posts