రాఫెల్ ఒప్పందంపై గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. రఫేల్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణను కోరుతూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్.. ఈ పిటిషన్లను విచారించేందుకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
ఈ రాఫెల్ ఒప్పందం చాలా చక్కగా జరిగిందని, గత ఒప్పందం కంటే చాలా మేలైందని ఇటీవలే కాగ్ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా ప్రతిపక్షాలు అధికార బీజేపీ ని విమర్శిస్తూనే ఉన్నాయి.
రాజధాని పేరుతో రైతులను ముంచారు: మంత్రి బొత్స