ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. ఈ నెల 8న జరగనున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కోసం జగన్ శారద పీఠానికి వెళ్లారని సమాచారం.
సచివాలయంలోని తన చాంబర్‌లోకి ప్రవేశించేందుకు అనువైన ముహూర్తం వంటి వాటిపై స్వామి సూచనలు తీసుకోనున్నారు. మరోవైపు, కేబినెట్ పదవి ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు పీఠాన్ని సందర్శించి స్వామి ఆశీస్సులు తీసుకుంటున్నారు.
యోగి అదిత్యనాథ్కు ఓటు వేకుంటే జేసీబీలు, బుల్డోజర్లుతో తొకిస్తాం..