telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభం: సీఎం జగన్

cm jagan ycp

ఈ విద్యాసంవత్సరం  ఆగష్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు- నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉందన్నారు.

ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో తొమ్మిది రకాల సదుపాయాలను కల్పించాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఇప్పటికే రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ని కూడా విడుదల చేశామని తెలిపారు. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో నిర్మాణ పనులకు అవసరమైన మెటిరియల్, సిమెంట్, ఇటుకల కొరత లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో పనులు పూర్తి కావడానికి కలెక్టర్లు ప్రతిరోజూ సమీక్ష చేయాలని జగన్‌ సూచించారు.

Related posts