telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ప్రస్తుత రాజకీయాలపై ..రజనీ, కమల్ కు చిరంజీవి సలహా!

chiranjeevi

ప్రస్తుత రాజకీయాలపై తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమలహాసన్ లకు మెగాస్టార్ చిరంజీవి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలు కులం, ధనం ప్రాతిపదికగా నడుస్తున్నాయని సూచినట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవద్దని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.

కమలహాసన్ ఇప్పటికే మక్కల్ నీధి మయ్యమ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ త్వరలోనే తన పార్టీని ప్రకటించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన మిత్రులిద్దరికీ చిరంజీవి సలహా ఇచ్చారని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

Related posts