telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దేశంలో అత్యంత పిరికి నాయుడు చంద్ర‌బాబు -కొడాలి నాని ఘాటు వ్యాఖ్య‌లు

*చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు కొడాలి నాని కౌంట‌ర్‌
*దేశంలో అత్యంత పిరికి నాయుడు చంద్ర‌బాబు..
 *రాజీనామా ఎప్పుడుచేయాలో మాకు తెలుసు…మీ సలహాలు అవసరం లేదు.
*చంద్ర‌బాబు స‌ర్పంచ్‌తో కూడా రాజీనామా చేయించ‌లేడు..

23 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు స‌వాల్‌పై మాజీ మంత్రి కొడాలి నాని కౌంట‌ర్ ఇచ్చాడు. ఎప్పుడు రాజీనామాలు చేయాలో తమకు, జగన్‌కు తెలుసని.. చంద్రబాబు సలహాలు తమకు అవసరం లేదని అన్నారు.

చంద్రబాబు ఉచిత సలహాలు మాని.. మీ పార్టీ ముగ్గురు ఎంపీలు, రాజ్యసభ సభ్యులచే రాజీనామా చేయించాలి’’ అని డిమాండ్ చేశారు.ఎంపీ, ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాలు చేయించి వైసీపీ ద్వారా గెలిపించిన చరిత్ర జగన్‌ది అని చెప్పుకొచ్చారు.

భారతదేశంలోని అత్యంత పిరికి నాయకుడు చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఎమ్మెల్యేను కాదు కదా సమస్యపై సర్పంచ్‌ను కూడా రాజీనామాను చేయించని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.  ఎన్నికలంటే పారిపోయే చంద్రబాబు తమకు సలహాలు ఇవ్వడం హాస్యస్పదమంటూ కొడాలి నాని యెద్దేవా చేశారు.

Related posts