telugu navyamedia
వార్తలు సామాజిక

శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇబ్బందులు: సత్య నాదెళ్ల

satyanadella

కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఒక ప్రకటన చేసింది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. దీంతో అన్ని కంపెనీలు దాదాపు ఇదే బాట పడతాయని భావించారు. అయితే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల దీనికి విరుద్ధంగా స్పందించారు.న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు అభిప్రాయపడ్డారు. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు.

ఉద్యోగుల మానసిక స్థితిపై కూడా ఇది ప్రభావం చూపుతుందని చెప్పారు. పరస్పర సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. వీడియో కాల్స్ ఎప్పటికీ వ్యక్తిగత సమావేశాలను భర్తీ చేయలేవని చెప్పారు. ఒక వ్యక్తి పక్కనే ఉంటే, ఎప్పుడైనా మాట్లాడుకునే అవకాశం ఉంటుందని అన్నారు. శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. దీని కోసం కంపెనీలు కూడా నిబంధనలను మార్చుకోవాల్సి వస్తుందని చెప్పారు.

Related posts