telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

రెండు రాష్ట్రాల్లో హైఅలర్ట్

High alert punjab Gujarat states

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున భారత వైమానికి దళాలు మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్, గుజరాత్‌లలో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని పాక్ సరిహద్దు జిల్లాల్లో పోలీసులు, భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన గుజరాత్ డీజీపీ సమావేశాన్ని రద్దు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లోని భద్రతా బలగాలను మోహరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసంలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ లు పాల్గొన్నారు.

Related posts