telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” మొదటిరోజు కలెక్షన్స్

Dear-Comrade

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్”. ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో వచ్చాయి. “డియర్ కామ్రేడ్” సినిమా 34 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమాకు మొదటిరోజే 11 కోట్లదాకా కలెక్షన్లు రావడం విశేషం. “డియర్ కామ్రేడ్” సినిమా నైజాంలో 3 కోట్ల రుపాయలు వసూలు చేయగా, సీడెడ్ ఏరియాలో 90 లక్షల కలెక్షన్లు సాధించింది. వైజాగ్ ఏరియాలో 89 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 90 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 53 లక్షలు, కృష్ణా జిల్లాలో 38 లక్షలు, గుంటూర్ జిల్లాలో 62 లక్షలు, నెల్లూర్ జిల్లాలో 26 లక్షల కలెక్షన్లు సాధించటం విశేషం. ఆంధ్రా, తెలంగాణలలో 7 కోట్ల 48 లక్షల షేర్ మొదటిరోజే “డియర్ కామ్రేడ్” వసూలు చేసింది. ఓవర్సీస్ లో “డియర్ కామ్రేడ్” సినిమా కోటీ 60 లక్షలు వసూలు చేయగా, కర్ణాటకలో 72 లక్షలు, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కోటీ 30 లక్షల షేర్ సాధించినట్లు తెలుస్తుంది. డియర్ కామ్రేడ్ సినిమా మొదటిరోజే 11 కోట్ల 10 లక్షల షేర్ సాధించింది. ఈ సినిమాకు 18 కోట్ల రుపాయల గ్రాస్ వసూళ్ళు వచ్చాయి. వీకెండ్ వరకు ఇదే జోరు కొనసాగితే మాత్రం డియర్ కామ్రేడ్ పుల్ రన్లో 50 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే యావరేజ్ టాక్ వచ్చినా “డియర్ కామ్రేడ్” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే.

Related posts