telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కెజియఫ్ 2… క్లైమాక్స్ విషాదాంతమే

kgf

కెజియఫ్ రెండో భాగానికి భారీ ఆఫర్స్ వస్తున్నా నిర్మాతలు మాత్రం అస్సలు టెంప్ట్ కావడం లేదు. సినిమా పూర్తయిన తర్వాత కానీ అమ్మకూడ‌దని నిర్ణ‌యం తీసుకుంటున్నారు. ప‌్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో య‌శ్ హీరోగా న‌టించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. అక్టోబర్ 23న ఈ సినిమా విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో కెజియఫ్ 2 ఒకేరోజు విడుదలవుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలు హైదరాబాద్‌లోనే చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు దర్శకుడు ప్రశాంత్. ఆర్ఎఫ్‌సీలో ప్రత్యేకంగా ఈ చిత్రం కోసమే సెట్ వేసారు. విలన్ సంజయ్ దత్, హీరో యష్ మధ్య యాక్షన్ సన్నివేశాలు ఇదివరకే చిత్రీకరించాడు దర్శకుడు. ఇదిలా ఉంటే క్లైమాక్స్‌లో మెయిన్ విలన్ అధీరాను రాఖీ చంపేసిన తర్వాత బాధ్షా అయిపోతాడు. అయితే దేశ ప్రధాని పాత్రలో నటిస్తున్న రవీనా టాండన్ తన సైన్యంతో రాఖీ భాయ్‌ను కూడా చంపించేస్తుందని తెలుస్తుంది. అలా క్లైమాక్స్ విషాదాంతమే అవుతుందని అమ్మ మాట ప్రకారం చచ్చిపోయేటప్పుడు ధనవంతుడిగానే రాఖీ చచ్చిపోతాడని అలా కెజియఫ్ కథ అంతమైపోతుందని ప్రచారం జరుగుతుంది.

Related posts