శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో “రణరంగం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాకినాడ ప్రాంతంలో ఉండే చిన్న రౌడీ… మాఫియాగా మారే నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడని చెబుతున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానున్న విషయం విదితమే. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా విజయంపై చిత్రయూనిట్ ధీమాగా ఉంది. సుధీర్ వర్మ ఈ కథను ముందుగా మాస్ మహారాజ్ రవితేజకు చెప్పాడట. రవితేజకు కూడా కథ నచ్చిందట. అయితే `డిస్కోరాజా`తో బిజీగా ఉండడంతో వెంటనే నిర్ణయం చెప్పలేదట. మరోవైపు ఈ కథ గురించి తెలుసుకున్న యంగ్ హీరో శర్వానంద్ ఈ సినిమాలో తాను నటిస్తానని సుధీర్‌కు చెప్పాడట. అలాగే రవితేజను కూడా రిక్వెస్ట్ చేశాడట. దీంతో రవితేజ ఆ కథను, డైరెక్టర్‌ను శర్వానంద్‌కు ఇచ్చేశాడట. ఇప్పుడు ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
previous post
నువ్వు పార్టీ బాకీ ఉన్నావ్… ప్రముఖ నిర్మాతకు ఛార్మి ట్వీట్