“క్షణం” సినిమాతో ఊహించని సక్సెస్ ను అందుకున్నాడు హీరో అడివిశేష్. లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇప్పుడు మరోసారి పివిపి సినిమా, హీరో అడివిశేష్ కాంబినేషన్‌లో “ఎవరు” అనే థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఈ చిత్రంలో అడివిశేష్ హీరోగా నటిస్తుండగా, రెజీనా కసండ్ర హీరోయిన్‌గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పి.వి.పి బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అడివిశేష్ మాట్లాడుతూ “ఎవరు” సినిమాను ఓ ఆఫీస్ బాయ్‌కి డెడికేట్ చేస్తున్నానంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. `క్షణం` సినిమా సమయంలో పి.వి.పి ఆపీస్‌లో పనిచేసే ఓ ఆఫీస్ బాయ్ తన మిత్రుడితో మాట్లాడుతూ “ఆ ఏముందిలే ఏదో చిన్న సినిమా… ఊపిరి వచ్చేదాకా ఓ ప్లేస్ హోల్డర్” అని అన్నాడట. అది శేష్ విన్నారట. అప్పటి నుండి తనని తాను 2.0 వెర్షన్‌గా భావించి `క్షణం`, `అమీతుమీ`, `గూఢచారి` సినిమాలు చేశానని.. ఆఫీస్ బాయ్‌ని తప్పని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సదరు ఆఫీస్ బాయ్‌కే ఈ సినిమాను డెడికేట్ చేస్తున్నానంటూ స్టేజ్ మీద తనకు ఎదురైన అనుభవాన్ని తెలియజేశారు అడివిశేష్.
previous post
యువతితో డైరెక్టర్ బూతు చాటింగ్… అసలు జరిగిన కథ ఇదీ…!