telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీదేవిని మలైకాతో పోల్చిన నెటిజన్… దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన అర్జున్

Arjun-Kapoor-and-Malaika-Arora-Khan

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, నటి మలైకా అరోరాలు పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొన్నిరోజుల క్రితం మీడియాలో విన్పించాయి. తాజాగా ఒకరు అటు తల్లి శ్రీదీవి, ఇటు మలైకా అరోరాలను పోలుస్తూ అర్జున్ కపూర్ ను ఒక ప్రశ్న అడిగారు. దీనికి అర్జున్ కపూర్ దిమ్మతిరిగే సమాధానం చెప్పడంతో, ఆ ఫ్యాన్ చివరికి క్షమాపణలు కోరాల్సివచ్చింది. అసలేం జరిగిందంటే… కుసుమ్ అనే అభిమాని అర్జున్ కపూర్‌ను ట్విట్టర్ ద్వారా “మీరు మీ తండ్రి రెండవ భార్య శ్రీదేవిని ద్వేషించారు. శ్రీదేవి వచ్చాక మీ అమ్మకు అన్యాయం జరిగిందని భావించారు. మరి మీరు అటువంటి మహిళతోనే డేట్‌కు వెళుతున్నారు. ఆమెకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు కదా! ఈ డబుల్ స్టాండర్డ్ ఏమిటీ అర్జున్?” అని ప్రశ్నించారు. దీనికి అర్జున్ సమాధానమిస్తూ “నేను ఎవరినీ ద్వేషించ లేదు కుసుమ్! మా మధ్య దూరం ఏర్పడింది. నిజంగా ద్వేషమనేదే ఉంటే శ్రేదేవి అంత్యక్రియల సమయంలో నేను నా తండ్రి, జాన్వీ, ఖుషీలతో పాటు ఉండేవాడిని కాదు. టైపింగ్‌తో ఏదేదో రాయడం, ఇతరులను జడ్జ్ చేయడం సులభమే. కానీ అంతకు ముందు ఆలోచించడం అవసరం” అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె అర్జున్ కపూర్‌ను క్షమాపణలు కోరాల్సి వచ్చింది.

Related posts