telugu navyamedia
సినిమా వార్తలు

మాజీ ప్రియురాలితో శింబు

Simbu

మాజీ ప్రియురాళ్లతో నటించే అవకాశం శింబుకు మాత్రమే దక్కుతుంది. ప్రస్తుతం హన్సిక నటిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రం ‘మహా’. జలీల్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో ప్రత్యేక అతిథి పాత్రలో శింబు నటిస్తున్నారు. అతిథి పాత్ర అంటే అలా వచ్చి ఇలా వెళ్లే పాత్ర కాదట శింబుది. చాలాకాలం తరువాత మాజీ ప్రియురాలు హన్సికతో కలసి నటిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. ఇటీవల శింబు చిత్ర యూనిట్‌తో జాయిన్‌ అయ్యారు. ‘వాలు’ చిత్రంలో నటించే సమయంలో శింబు, హన్సికల మధ్య ప్రేమాయణం సాగింది. ఆ చిత్రం పూర్తి అయ్యే సమయానికి వారి ప్రేమ ముక్కలైంది. దీనికి తామిద్దరం కారణం కాదని శింబు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం హన్సిక తమిళ, తెలుగు చిత్రాల్లో బిజీ అయిపోయింది. గతంలో ఆయన తన మరో మాజీ ప్రియురాలైన నయనతారతో ‘ఇదు నమ్మ ఆలు’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

Related posts