దర్శకురాలు సుధా కొంగర ప్రసాద్, తమిళ కథానాయకుడు సూర్య కాంబినేషన్‌లో ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం తెరకెక్కనుంది. ఆదివారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఈ చిత్రం కోసం ఆయన మరింత ఫిట్‌గా తయారైనట్లు తెలుస్తోంది. ఫస్ట్‌లుక్‌లో చొక్కా లేకుండా నల్లని బనియన్‌తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితాధారంగా రూపొందుతున్న చిత్రం ఇది.
నటుడు మోహన్ బాబు ఇందులోని ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అపర్ణ బాలమురలి కథానాయిక. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు: సుజనా చౌదరి