telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

సౌరకుటుంబంలో గ్రహాలు..ఇక్కడైతే వజ్రాల వర్షం కూడా పడుతుందట..

diamond rain in a planet of solar system

కాస్త ఎండ ఎక్కువగా ఉన్నా లేదా కాస్త ఎక్కువ వర్షపాతం పడినా సాధారణ జీవితం కుదరటంలేదని అల్లాడిపోతుంటాం. అదే గంటకు 8000 కిలోమీటర్లతో గాలులు వీచే చోట గానీ.. లేదా ఇనుము సైతం కరిగిపోయేంతగా తీవ్రమైన ఎండలు ఉన్న చోట గానీ.. మనం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి… కొంచెం భయమేస్తుంది కదూ. ఇలాంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్న గ్రహాలెన్నో మన సౌర కుటుంబంలో ఉన్నాయట. నివాసయోగ్యం కానీ గ్రహాల్లో మొదటి వరుసలో ఉంటుంది శుక్రగ్రహం. సూర్యుడికి అతి చేరువగా ఉండటం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి. ఈ గ్రహంపై కార్బన్‌డైఅక్సయిడ్ ఒక పొరలా కప్పి ఉంటుంది. ఒక్కోసారి ఈ గ్రహం మీద వేడి కనిష్టంగా 460 డిగ్రీల వరకు చేరుకుంటుంది. మీకు బాగా అర్ధమయ్యేలా చెప్పాలంటే.. ఈ గ్రహం మీద కాలు పెడితే.. బూడిద అయినట్లే. ఈ గ్రహంపై అప్పుడప్పుడూ వర్షం కూడా కురుస్తుంది. అదంతా సల్ఫర్ యాసిడ్‌తో ఉంటుంది. ఈ వర్షంలో తడిస్తే.. మన చర్మం కాలిపోతుంటుంది. అటు మంచు కూడా ఈ గ్రహంపై అనుకోని అతిథిలా కమ్ముకుంటుంది.

నెప్ట్యూన్ గ్రహంలో మిటైన్‌తో నిండిన మేఘాలు ఉంటాయి. ఈ గ్రహంలో తీవ్రమైన గాలులు వీస్తాయి. గ్రహ ఆకృతి చాలా చదునుగా ఉండటం వల్ల వాటిని ఆపడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. అంతేకాకుండా గంటకు సుమారు 2400 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి. ఇక్కడ వాతావరణంలో కార్బన్ సంపీడనం చెందటం వల్ల వజ్రాల వర్షం కురుస్తుంది. కానీ అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీలు ఉండటంతో వజ్రాలు నేలపై రాలేలోపే గడ్డ కట్టుకుపోతాయి. ఇలా మరెన్నో గ్రహాలు సౌర కుటుంబంలో విపరీతమైన వాతావరణాలు కలిగి ఉంటాయి.

Related posts