చైనా నుండి వచ్చిన కరోనా మన దేశం పై చాలా ప్రభావం చూపించింది. అయితే కోవిడ్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన వ్యక్తిగత ఐటీ రిటర్న్‌ల దాఖలు గడువును మరోసారి పొడిగించింది ప్రభుత్వం… 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్) గడువును ఈ నెల డిసెంబర్ 31 నుంచి 2021 జనవరి 10వ తేదీ వరకూ పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇక, అకౌంట్ల ఆడిట్ అవసరం లేని, సహజంగా ఐటీర్-1, ఐటీఆర్-4 ఫార్మ్స్ ద్వారా రిటర్న్‌లు దాఖలు చేసే వారికి ఈ పొడిగింపు వర్తిస్తుందని ఆదాయం పన్ను శాఖ ప్రకటించింది… కాగా, కోవిడ్ కారణంగా ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడగా… మరోసారి కూడా కోవిడ్ తో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా ఈ గడువు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఇక, జీఎస్‌టీ కింద 2020 ఆర్థిక సంవత్సరం కింద వార్షిక రిటర్న్‌ల దాఖలు గడువును కూడా 2021 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. తాజా పొడిగింపుతో వ్యక్తిగత చెల్లింపులకు 10 రోజుల గడువు లభించింది.. వ్యక్తిగత చెల్లింపుదారులు జనవరి 10 వరకు ఐటీ రిటర్న్ దాఖలు చేసుకునే వెసులుబాటు దొరికింది. చూడాలి మరి ఇది ఇక్కడితో ముగిస్తుందా.. లేక మళ్ళీ పొడిగిస్తుందా అనేది.
previous post
next post
నాయకుల స్వార్థంతో రాజధాని మార్చాలని నిర్ణయం: యనమల