telugu navyamedia
ఆరోగ్యం వార్తలు

విశాఖ తీరంలో నిలిచిన చైనా షిప్…కరోనా భయంతో సముద్రంలోనే నిలిపివేత…

coronavirus tension in india a china ship arrived in visakhapatnam port

విశాఖకు వచ్చిన ఈ షిప్‌లో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది చైనీయులు, ముగ్గురు మయన్మార్ వాసులు ఉన్నారు. వీరికి కరోనా సోకిందన్న అనుమానంతో తీరానికి రావొద్దని విశాఖ తీరంలో కరోనా కలకలం రేపుతోంది. చైనాకు చెందిన ఫార్చూన్‌ హీరో షిప్‌ తీరానికి సమీపంలోకి రావడంతో పోర్ట్‌కి రావడానికి అధికారులు అనుమతి నిరాకరించారు.

పారాదీప్ పోర్టు అనుమతి నిరాకరించడంతో విశాఖకు వచ్చిన ఈ షిప్‌లో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది చైనీయులు, ముగ్గురు మయన్మార్ వాసులు ఉన్నారు. వీరికి కరోనా సోకిందన్న అనుమానంతో తీరానికి రావొద్దని ఆంక్షలు విధించారు. వీరికి వైద్యపరీక్షలు చేసే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా ఈ షిప్‌ను వెనక్కు తిప్పి పంపాలనే పోర్ట్ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

చైనా నుంచి వచ్చిన షిప్ అంటే మరింత కంగారు ఉంటుంది. పైగా షిప్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిపైనా స్పష్టత లేకపోవడంతో పోర్ట్‌కి రావడానికి అనుమతివ్వలేదు. ఇదిలా ఉంటే  ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. చైనాలో ఇప్పటికే 3వేలకు పైగా మృతి చెందినట్లు అధికారికంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో 139 మంది వైరస్​ బారిన పడినట్లు ధ్రువీకరించారు. అయితే చైనాలో కరోనా క్రమక్రమంగా తగ్గుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. వైరస్​ ధాటికి బుధవారం 31 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3 వేలు దాటింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది హుబే ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు. తాజాగా మరో 139 మందితో కలిపి కరోనా సోకిన వారి సంఖ్య 80 వేల 400కు చేరింది.

Related posts