కొంత కాలంగా బిజినెస్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన మంచు విష్ణు త్వరలో ఓ క్రాస్ ఓవర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకే సారి తెరకెక్కుతున్న ఓ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో..ఈ సినిమాకు మోసగాళ్లు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కా్‌మ్ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో అందాల చందమామ కాజల్ నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ వెటరన్ హీరో సునీల్ శెట్టి అదిరిపోయే పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాపై పై భారీ అంచనాలు నెలకొనగా తాజాగా సంక్రాంతి సందర్భంగా మరో పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. చుశాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.
previous post
అందుకే కాంగ్రెస్ ను వీడుతున్నాను: ఎమ్మెల్యే లింగయ్య