హైదరాబాదీ అమ్మాయి, హీరోయిన్ మనాలీ రాథోడ్. ఈ అమ్మడు తాజాగా విజ్జిత్‌ని వివాహం చేసుకుంది. వారి వివాహానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. హేమ, సురేష్ కొండేటి తదితరులు నూతన దంపతులకి ఆశీర్వాదం అందించారు. మనాలీ రాథోడ్ తన కెరియర్‌ని సపోర్టింగ్ రోల్స్‌తో స్టార్స్ చేయగా, ప్రస్తుతం హీరోయిన్‌గా నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ వంశీ తెరకెక్కించిన ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది.చివరిగా ఎంఎల్ఏ అనే చిత్రంలో నటించిన ఈ అమ్మడు తన తదుపరి సినిమా విషయాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఓ స్త్రీ రేపు రా, నేను లోకల్, ఫ్యాషన్ డిజైనర్, హౌరా బ్రిడ్జ్, ఎంఎల్‌ఏ’ వంటి చిత్రాల ద్వారా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ బ్యూటీ తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది.
ఈ సమయంలో సినిమా ప్రమోషన్స్ అవసరమా ?