telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కార్తికేయ-2” షూటింగ్ కు ముహూర్తం ఖరారు

nikhil

టాలెటెండ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ-2‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. కాగా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే హిస్టారికల్ కి సంబంధించిన ఓ కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. నిఖిల్ ‘కార్తికేయ 2’లో ‘రీతూ వర్మ’ నటించబోతుందట. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల అన్ని సినిమా షూటింగ్స్ తో పాటుగా ఈ సినిమా కూడా నిలిచిపోయింది. కానీ ఇప్పుడు కరోనా నియమాలను పాటిస్తూ షూటింగ్ జరుపుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో ఈ చిత్రబృందం షూటింగ్ కు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 26 నుండి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసిందట చిత్రబృందం.

కాగా టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్ధ్ కు ప్రత్యేక స్థానం ఉంది. ‘హ్యాపీడేస్”తో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ స్టర్ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. అయితే స్వామి రారా, కార్తికేయ వంటి సినిమాలు నిఖిల్ ను టాలీవుడ్ లో నిలబెట్టాయి. ఆ తర్వాత కిరాక్ పార్టీలో నటించిన నిఖిల్ ఇప్పుడు ‘కార్తికేయ2′ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ ’18 పేజీస్‌’ అలాగే శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్‌) బ్యానర్‌పై మరో సినిమా అనౌన్స్ చేసాడు.

Related posts