కన్నతల్లే పిల్లల్ని చంపిన అమానవీయ సంఘటన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టాకోనీలోని హెగెర్మాన్ స్ట్రీట్ 6300 బ్లాక్‌లో సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తుపాకీ పేలిన శబ్దం విన్న పక్కింటివారు 911కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఘటన జరిగిన ఇంటి తలుపులు పగలగొట్టి లోపలకి వెళ్లి చూశారు. ఆ ఇంట్లో 4 ఏళ్ల చిన్నారి, 10 నెలల బాలుడితో పాటు 38 ఏళ్ల మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉండడం గమనించారు. దాంతో హుటాహుటిన ముగ్గురిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ ముగ్గురిని తుపాకీతో కాల్చిన అనంతరం తనను తాను గాయపరచుకుందా మహిళ. దీంతో తీవ్రంగా గాయపడిన నిందితురాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. కాగా, ఆమె ఇంత దారుణానికి పాల్పడడం వెనుక అసలు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఫిలడెల్ఫియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
previous post