telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

చేయని తప్పుకు 19 ఏళ్ళు జైలులో… ఇప్పుడు 34 కోట్ల నష్టపరిహారం

women online begging arrested

డేవిడ్ ఈస్ట్మన్(74) అనే వ్యక్తికి పోలీస్ ఉన్నతాధికారి కొలిన్ వించెస్టర్ హత్యకేసులో 1995లో న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి ఈస్ట్మన్ 2014 వరకు సుమారు 19 ఏళ్లు జైలులోనే ఉన్నాడు. ఈ ఘటన సిడ్నీలో జరిగింది. ఈ క్రమంలో పలుమార్లు కోర్టు ముందు తాను నిర్ధోషి అని నిరూపించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. చివరకు న్యాయస్థానం అతడ్ని 2014లో నిర్ధోషిగా తేల్చింది. వించెస్టర్ అనే పోలీస్ ఉన్నతాధికారి 1989లో సబర్బన్ కాన్బెర్రాలోని తన ఇంటి వద్ద కారు నుంచి దిగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఇప్పటికీ అతడ్ని హతమార్చింది ఎవరు అనేది మిస్టరీగానే ఉంది. అసలు హంతకులు ఎవరో ఇప్పటికీ పట్టుబడలేదు. తాజాగా ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ సుప్రీంకోర్టు విలువైన అతడి 20 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసినందుకు పరిహారంగా రూ. 34 కోట్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. తాను చేయని తప్పుకు 20 ఏళ్లు జైలుకు వెళ్లడం వల్ల తన తల్లితో పాటు చెల్లెల్ని కూడా పొగొట్టుకున్నానని ఈస్ట్మన్ కోర్టులో తన గోడును వినిపించాడు. 2006లో తోటి ఖైదీ ఒకరు తనపై దాడికి పాల్పడడంతో ఒక కంటిచూపు పోయిందని వాపోయాడు. ఈస్ట్మన్ తరఫు న్యాయవాది సామ్ టీర్నే మాట్లాడుతూ తన క్లైంట్‌కు భారీ పరిహారం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. 20 ఏళ్ల తన విలువైన జీవితాన్ని తిరిగి ఎలాగూ ఇవ్వలేం. కానీ మిగిలిన అతడి శేష జీవితాన్ని హాయిగా గడిపెందుకు ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నారు.

Related posts