telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఏసీలు వాడుతున్నారా… అయితే ఈ సమస్యలు తప్పవు!

ఎండాకాలం వస్తుండగా అందరూ ఏసీలను మళ్లీ రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఎండకాలంలో కూలింగ్‌లో ఉండటాన్ని మన బాడీ కోరుకుంటుంది. అయితే.. ఎక్కువసేపు ఏసీలో ఉంటే సైడ్ ఎఫెక్ట్స్‌ తెస్తోందని పరిశోధనల్లో తేలింది. ఈ ఎయిర్‌ కూలింగ్‌ ద్వారా మనకు వచ్చే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం.

ఏసీ వల్ల కళ్లలో మంటలు, దురద వంటివి వస్తున్నాయి.
ఏసీలో డోర్స్‌ క్లోజ్‌ చేయడం వల్ల ఆక్సిజన్‌ తక్కువై తపనొప్పి వస్తుంది. అది మైగ్రేన్‌గా మారే ఛాన్స్‌ కూడా ఉంది.
లోబీపీ వచ్చేందుకు కూడా ఏసీ కారణమవుతుంది
ఏసీ చల్లదనంతో డీహైడ్రేషన్‌కు గురవుతారు
ఏసీ వల్ల చర్మం పొడిబారిపోతుంది.
విషపూరితం
ఏసీల వల్ల మరో సమస్య ఎలుకలు. సెంట్రల్‌ ఏసీల్లో ఎలుకలు గూడు కట్టుకుంటాయి. వ్యర్థాలను అక్కడే తింటాయి. ఫలితంగా ఏసీల్లో వాతావరణం విషపూరితం అవుతుంది. మనకు రకరకాల వ్యాధులు వస్తాయి. అందుకే ఏసీలను నెలకోకసారి క్లీన్‌ చేసుకోవాలి.

Related posts