హాలీవుడ్‌లో యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకాదరణ ఉంటుంది. “అవెంజర్స్ ది ఎండ్ గేమ్” చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ చిత్రంలో కీలక పాత్రధారిగా నటించిన స్టార్ జెరెమీ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. డ్రగ్స్‌కు బానిసైన ఈ హీరో నోట్లో గన్ పెట్టుకుని కాల్చుకునే ప్రయత్నం చేశాడు. అదే గన్‌తో ఇంటి పైకప్పుపై కాల్పులు జరిపాడు. తన మాజీ భార్య సోనీ పచెకోను హత్య చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని ఈ హీరో మాజీ భార్య కోర్టులో తెలిపింది. 2014లో నటి, మోడల్ సోనీ పచెకోను జెరెమీ వివాహం చేసుకున్నాడు. అయితే ఏడాది తర్వాత మనస్పర్ధలతో ఇద్దరూ విడిపోయారు. వీరి కుమార్తె ‘అవా’ ఎవరి దగ్గరుండాలనే దానిపై ప్రస్తుతం కోర్టులో కేసు కూడా నడుస్తుంది. కోర్టు నవంబర్‌లో ఈ కేసు తీర్పును చెప్పనుంది.
next post