పెట్రోల్ ధరలు మళ్ళీ వరుస పెరుగుదలను నమోదుచేసుకుంటున్నాయి. గతంలో పైసాపైసా ఎలా తగ్గిందో, అలాగే పెరుగుతుండటం విశేషం. దీనితో అప్పటిలో తగ్గుదల, ఇప్పటి పెరుగుదల వినియోగదారులకు పెద్ద విషయంగా తోచకపోవడం గమనార్హం. అందుకే, పైసాపైసా విధానం కేంద్రం అమలులోకి తెచ్చినట్టు తెలుస్తుంది. ఇక, అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో క్రూడాయిల్ ధర పెరుగుతుండడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పైనే కనిపిస్తోంది. డాలర్ మారకంతో రూపాయి బలహీన పడుతుండడంతో ఆయిల్ కంపెనీలు క్రూడ్ ధరలు పెంచుతూ పోతున్నాయి. ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోల్ ధర 17-20 పైసల మధ్య పెరగగా, లీటరు డీజిల్ ధర 20 పైసల దాకా పెరిగింది.
* ఢిల్లీలో నేడు లీటరు పెట్రోల్ ధర 17 పైసలు పెరిగి రూ.70.72కు, డీజిల్ ధర 19 పైసలు పెరిగి రూ.65.16గా చేరింది.
* హైదరాబాద్‌లో లీటరు పెట్రల్ ధర రూ.75.03గా, లీటరు డీజిల్ ధర రూ.70.83గా చేరింది.
* ముంబయిలో లీటరు పెట్రోల్ ధర 17 పైసలు పెరిగి రూ.76.35గా, డీజిల్ ధర 20పైసలు పెరిగి రూ.68.22గా ఉన్నాయి.
* చెన్నైలో పెట్రోల్ ధర రూ.73.41గా, డీజిల్ ధర రూ.68.82కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.72.82కు, డీజిల్ ధర రూ.66.94కు చేరింది.
* బెంగళూరులో పెట్రోల్ ధర రూ.73.05గా, డీజిల్ ధర రూ.67.10గా ఉన్నాయి.
అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావంతో దేశీయంగా కూడా చమురు ధరలు పెరుగుతున్నాయి. 2019 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ధర లీటరుకు రూ.1.82పైసలు, డీజిల్ ధర రూ.2 దాకా పెరగడం విశేషం.