telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

అమెజాన్.. సరికొత్త ఆఫర్లు .. Fab Phones Fest sale ..

amazon indias fab phones fest sale

అమెజాన్ మళ్లీ సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను అలరించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా Amazon India’s Fab Phones Fest sale పేరుతో వీక్లీ సేల్ కి తెరలేపింది. ఈ సేల్ ఏప్రిల్ 11న మొదలై 13 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అలాగే మొబైల్ ఫోన్ల మీద బండిల్ ఆఫర్స్, యాక్ససరీస్ మీద అదిరిపోయో ఆఫర్లు ఉండనున్నాయి. ఎవరైనా గత నెలలో డిస్కౌంట్లో కొనుగోలు చేయాలనుకున్న వస్తువులు మరచిపోతే ఈ సేల్ లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. దిగ్గజ కంపెనీల ఫోన్లు సరసమైన ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి.

అమెజాన్ ఈ సేల్ మీద ఓ ఆసక్తికర టీజర్ ని విడుదల చేసింది. Fab Phones Fest saleలో మీరు అత్యంత తక్కువ ధరలో మీకు నచ్చిన ఫోన్ ని సొంతం చేసుకుంటారని ఈ మేరకు మేము మీకు ప్రామిస్ చేస్తున్నామంటూ తెలిపింది. వన్‌ప్లస్ 6టీని మీు ఊహించని ధరకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది.

ఐఫోన్ ఎక్స్ ని ఐఫోన్ అభిమానులు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. కాగా ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.74,999గా ఉంది. అయితే ఎంత డిస్కౌంట్ ప్రకటించారనేది ఇంకా తెలియలేదు. నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్సన్ అందుబాటులో ఉంది. కాగా ఇప్పటికే ఐఫోన్ ఎక్స్ఆర్ ని కంపెనీ డిస్కౌంట్ ధరలో అందిస్తోంది. HDFC Bank customersకి క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది.

అమెజాన్ లాండింగ్ పేజీలో హానర్ ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపులు ఉంటాయని ఇప్పటికే తెలిపింది. దీని ప్రకారం రానున్న Amazon Fab Phones Fest Saleలో హానర్ ఫోన్లు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 8 వేల వరకు తగ్గుతాయని అంచనా.

amazon indias fab phones fest salesఒప్పో కంపెనీ ఫోన్లు కూడా ఈ సేల్ లో డిస్కౌంట్ ధరలతో కనువిందు చేయనున్నాయి. నార్మల్ ఎక్స్చేంజ్ ధర కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు అమెజాన్ ఇండియా Realme U1 మీద డీల్స్ ని కూడా టీజర్ లో పొందుపరిచింది.

ఈ సేల్ లో ఫ్లాట్ డిస్కౌంట్లు, బండిల్ ఆఫర్స్ total damage protection plans, no-cost EMI payment options, exchange offers,ఇంకా ఇతర ప్రయోజనాలను అందించనుంది. అమెజాన్ ఇండియా కంపెనీ Cashifyతో టైఅప్ అయింది. పాత ఫోన్ల కొనుగోలు మీద 6 శాతం కన్నా ఎక్కువగానే డిస్కౌంట్ అందించనుంది

Related posts