telugu navyamedia
సినిమా వార్తలు

“జై సేన” టీజర్ : కొంచం యాక్షన్… కొంచం కామెడీ

Jai-Sena

వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “జై సేన”. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను హీరో గోపీచంద్ చేతుల మీదుగా విడుదల చేశారు. సినిమాలను ఎక్కువగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో సునీల్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ “దేవదాస్”గా సునీల్ పాత్రను పరిచయం చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. ఈ టీజర్లో కామెడీ సీన్స్ ఎక్కువగా కన్పిస్తున్నాయి. గతంలో చైల్డ్ ఆర్టిస్టులుగా కొన్ని సినిమాల్లో కనిపించిన ఓ నలుగురు కుర్రాళ్లు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక సునీల్ హీరోగా డీలా పడి, ఇప్పుడిప్పుడే మళ్ళీ కమెడియన్ గా మంచి పాత్రలను దక్కించుకుంటున్నారు. మరి ఈ చిత్రం మొత్తం ఆయన చుట్టూనే తిరిగేలా కన్పిస్తోంది టీజర్ చూస్తుంటే… మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.

Related posts