telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ ఊరి ప్రజలకు క్షమాపణ చెప్పిన హీరోయిన్… ఎందుకంటే ?

Vanita

తమిళ నటుడు విజయ్ కుమార్ కూతురు, తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ వనిత మూడో పెళ్లి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వనిత మూడో భర్త తన మొదటి భార్యకు విడాకులు ఇంకా ఇవ్వలేదు. దాంతో చాలామంది సెలబ్రెటీలు, ప్రజలు వనిత పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో, టెలివిజన్ ఛానెల్స్‌లో మాటల యుద్ధం కొనసాగుతున్నది. అయితే వనిత ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “మా ఊరు అయిన తంజావూరులో రెండో పెళ్లి చేసుకోవడం చాలా సహజం. అక్కడ చాలా మంది రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల మూడో పెళ్లి చేసుకున్నాను” అని తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. దాంతో తంజావూరు ప్రజలు వనిత కారణంగా తమ ఊరి పరువు పోయిందని, ఆవిడ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. దాంతో వెంటనే తాను ఉద్దేశపూర్వకంగా ఏ రకమైన వ్యాఖ్యలు చేయలేదని నా మాటలు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి అంటూ క్షమాపణలు తెలిపింది వనిత.

Related posts