telugu navyamedia
సినిమా వార్తలు

‘రిపబ్లిక్’ ట్రైలర్ విడుదల…

మెగాహీరో సాయి ధ‌ర‌మ్ తేజ్​ నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. ఈ సినిమా ట్రైలర్​ను సెప్టెంబర్​ 22, ఉదయం 10గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో పంజా అభిరామ్​ అనే ఐఏఎస్ అధికారిగా సాయి తేజ్ కనిపించనున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేశ్​ హీరోయిన్ గా న‌టిస్తోంది.

republic

దేవకట్టా దర్శకత్వంలో జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 1న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో దేవాకట్టా బిజీ గా ఉన్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేకర్స్ .. చిరు నటించిన కొన్ని సినిమాల క్లిప్స్ తో ఓ మాంటేజ్ వీడియోను ట్విట్టర్ లో విడుదల చేశారు. అందులో సాయిధరమ్ తేజ్‌ తనకు చరణ్ లాంటివాడని, అతడిలో తనను తాను చూసుకుంటున్నానని చిరంజీవి ఒక సందర్భంలో చెప్పిన .. మాటల్ని హైలైట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో మెగాభిమానుల్ని మెప్పిస్తోంది.

Related posts