telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

దర్బార్‌ చిత్రంలో .. రజనీకాంత్ లుక్ .. లీక్ ..

rajnikanth movie darbar look leak

రజనీకాంత్‌ తాజా చిత్రం ‘దర్బార్‌’ లోని పోలీస్‌ లుక్‌ లీక్‌ అయింది. ఈ ఫొటో ఇప్పుడు నెంటింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ లుక్‌లో రజనీకాంత్‌ ముంబాయి పోలీస్‌ ఆఫీసర్‌గా చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఇటీవలే సూర్య చిత్రం ‘బందోబస్త్‌’ ఆడియో వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘దర్బార్‌’ అవుట్‌ పుట్‌ చాలా అద్భుతంగా వస్తుందని, దర్శకుడు మురుగదాస్‌ పనితనాన్ని అభినంచాలని పేర్కొన్నాడు.

ఈ సినిమా ఎక్కువ భాగంగా ముంబాయిలోనే చిత్రీకరణ జరుగుతోంది. లైకా ప్రొడక్షన్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. నయన తార, యోగి బాబు, నివేదా థామస్‌, జతిన్‌ శర్మ వంటి వారంతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్‌ బాణీలు అందిస్తున్న ఈ సినిమాకు సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts