telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

తేనెతో .. ముఖం కాంతివంతంగా..

honey is best for face pack

చర్మ సౌందర్యానికి తేనే చేసే మేలు ఇంతఅంతా కాదు అంటుంది ఆయుర్వేదం కూడా. అందులోను ముఖ సౌందర్యంలో ఇది ప్రధాన పాత్ర పోషించనుంది. ముఖం కాంతివంతంగా, మృదువుగా మారడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు మేలు. తేనెతో కలిపే మిశ్రమం ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుంది. కొబ్బరినూనె, తేనె కలిపిన మిశ్రమాన్ని ఒంటికి పట్టించుకొని, కొంతసేపటి తర్వాత స్నానం చేస్తే చర్మం బిగుతుగా, నునుపుగా మారుతుంది. తేనె, టమాటా పేస్టు మిశ్రమాన్ని చర్మానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగితే ముఖం కాంతివంతమవుతుంది.

సమయాభావంతో ప్యాక్‌ కలుపుకునే అవకాశం లేకపోతే, కేవలం తేనెను ముఖానికి పట్టించి, ఐదు నిమిషాల తర్వాత కడిగితే చర్మం మృదువుగా మారుతుంది. ఉడికించిన ఓట్స్‌, తేనె బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ప్యాక్‌ వేసుకోవాలి. ఇది పొడిచర్మం గలవారికి మేలైన ప్యాక్‌. ఇది మాయిశ్చరైజింగ్‌గానే కాకుండా చర్మానికి మంచి క్లెన్సింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల తేనెలో టేబుల్‌స్పూన్‌ రోజ్‌వాటర్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి, మెడకు రాసుకొని, మసాజ్‌ చేస్తే, పొడిబారిన చర్మానికి జీవకళ వస్తుంది.

Related posts