telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

నిత్యానంద భూకైలాస్ .. అంతా తప్పించుకోడానికి వేసిన భూటకమే ..

nityananda escaped from india

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గుట్టుచప్పుడు కాకుండా కొన్ని నెలల ముందే దేశం నుంచి పరారయ్యాడు. గుజరాత్‌ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. అనేక వివాదాలతో పలుమార్లు పతాక శీర్షికలు ఎక్కిన నిత్యానంద..తమిళనాడులోని బిడిదితో పాటు అహ్మదాబాద్‌లో నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్ధనశర్మ అనే ఓ వ్యక్తి కేసు పెట్టాడు. ఈ కంప్లైంట్‌ గుజరాత్ హైకోర్టు వరకూ వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. గుజరాత్‌లో ఆశ్రమాన్ని నిర్వహిస్తోన్న సాధ్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధ్వి కిరణ్ అనే ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమంలో పరిస్థితిని చూసిన పోలీసులు..అక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు. నిత్యానంద ఆశ్రమంలోనుండి బయట పడ్డ 15 ఏళ్ల బాలిక అక్కడ జరుగుతున్న అరాచకాలను వివరించింది. నిత్యానంద ఆశ్రమంలో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసేవారని చెప్పుకొచ్చింది. స్వామీజీకి విరాళాలు సేకరించేందుకు తమతో ప్రమోషనల్‌ వీడియోలు చేయించేవారని..మాట వినకపోతే చిత్రహింసలు పెట్టేవారని వివరించింది.

నిత్యానందను తొమ్మిదేళ్లనాటి కేసు ఇంకా వెంటాడుతోంది. ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారం చేసాడని ఆరోపణ దాదాపు నిర్ధారణ అయింది. అప్పట్నుంచే నిత్యానంద బైట కన్పించడం లేదు. మరోవైపు గతంలో ఉన్న కేసుల్లో నిత్యానంద 40కిపైగా వాయిదాలకు కోర్టులో హాజరుకాలేదు.ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో నిత్యానంద నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయాడు. 2010 నటి రంజితతో సరసాల వీడియో బయటకు వచ్చిన తర్వాత పరువు పోగొట్టుకున్నాడు నిత్యానంద. ఈ కేసులో నిత్యానందను పోలీసులు అరెస్టు చేశారు. ఆశ్రమాల్లో ఇతడు చేసే డ్యాన్సులకు, వింతవింత చేస్టలకైతే కొదవేలేదు. వరుస వివాదాలు, అరెస్ట్‌ భయంతో దేశం విడిచిపోవాలని నిత్యానంద ఎప్పటినుండో ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది.చిత్రమేంటంటే.. నిత్యానంద పాస్‌పోర్ట్ 2018 సెప్టెంబర్‌లోనే గడువు తీరిపోయింది. అది తిరిగి రెన్యువల్ కాలేదు. అలాంటి వ్యక్తి విదేశాలకు ఎలా పారిపోయారన్నది తేలాల్సి ఉంది. ఇటీవల సొంత దేశం అంటూ చెప్పినవన్నీ దర్యాప్తు బృందాన్ని దారిమళ్లించేందుకు చేసినవే తప్ప మరొకటి కాదని తేలిపోయింది.

Related posts