telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం.. కార్మికుల ఆందోళన

New couples attack SR Nagar

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతుంది. ప్రభుత్వ వైఖరితో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. గత ఎనిమిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మెతో తన కుటుంబం రోడ్డున పడిందంటూ ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

శ్రీనివాస్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్టీసీ కార్మికుల ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బస్సులపై ​కార్మికులు దాడి చేయడంతో నాలుగు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, వారికి జీతాలు కూడా చెల్లించేది లేదంటూ ప్రభుత్వం ప్రకటించడంతో కార్మికులు తీవ్ర మనస‍్తాపానికి గురవుతున్నారు.

Related posts