ఏపీ టీడీపీలో విషాదం నెలకొంది. తణుకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులూ వైటీ రాజా కరోనా తో మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆయనను మృత్యువు వదలలేదు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మరాజా కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. దాంతో ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని 10 రోజుల కింద కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతితో నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వైటీ రాజా టీడీపీ పార్టీ తఫున 1999 లో తణుకు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004 , 2009 టీడీపీ తరఫునే పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. రాజా మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు.
previous post
next post