telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియా పాలించింది బ్రిటన్‌ కాదు అమెరికా వాళ్లే : ఉత్తరాఖండ్‌ సీఎం మరో సంచలనం

ఇటీవల ఉత్తరాఖండ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తీరత్ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమ్మాయిల వేషధారణపై చేసిన కామెంట్స్‌కు…అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. మారాల్సింది మా డ్రస్సింగ్‌ కాదు…మీ ఆలోచన విధానమంటూ మహిళలు, అమ్మాయిలు, ఉద్యోగులు ఫైరవుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌ సీఎం తీరత్‌ సింగ్‌రావత్‌… మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… ఇండియన్స్‌ను.. అమెరికా 200 ఏళ్లు బానిసలుగా చేసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణమైంది. రిప్ప్‌డ్‌ జీన్స్‌ వివాదం ఇంకా ముగియముందే ఆయన మరో వివాదంలో పడిపోవడం గమనార్హం. దేశంలో కోవిడ్‌ పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ “200 ఏళ్లుగా భారతీయుల్ని బానిసల్ని చేసి..ఆధిపత్యం చెలాయించిన ఆమెరికా సైతం కోవిడ్‌ను ఎదుర్కొలేక చేతులెత్తేసింది” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా “రవి అస్తమించని రాజ్యం” అనే వ్యాఖ్యలను కూడా ఆయన ప్రసంగంలో జోడించారు. నిజానికి ఆయన బ్రిటన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇలా మాట్లాడారనే విషయం స్పష్టమే అయినప్పటికీ ఒక సీఎం ఇలా బ్రిటన్‌ కు అమెరికాకు తేడా తెలియకుండా మాట్లాడటం ఏంటని కొందరు ఫైర్‌ అవుతున్నారు.

Related posts