ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా దర్శకుడిగా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో సల్మాన్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌లు రూపొందిస్తున్నాడు. ఇప్పటికే సల్మాన్ – ప్రభుదేవా కాంబినేషన్‌లో వచ్చిన “వాంటెడ్” చిత్రం మంచి విజయం సాధించడంతో రీసెంట్‌గా “దబాంగ్ 3” చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా… ప్రభుదేవా- సల్మాన్ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రానికి “రాధే” టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు. నవంబర్ 4 నుండి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ముంబైలో జరుపుకోనుంది. 2017లో వచ్చిన కొరియన్ చిత్రం “ది ఔట్ లాస్”కి రీమేక్‌గా “రాధే” మూవీ తెరకెక్కనున్నట్టు సమాచారం. 2020 ఈద్‌కి ఈ చిత్రం విడుదల కానుంది. అసలు సంజయ్ లీలా భన్సాలీతో చేయాల్సి ఉన్నా “ఇన్షా అల్లా”ని ఈద్‌కి తీసుకు రావాలని సల్మాన్ భావించినప్పటికి, పలు కారణాల వలన ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో ప్రభుదేవాతో కలిసి “రాధే” సినిమాని వచ్చే ఏడాది ఈద్‌కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సల్మాన్.
previous post
నయనతార వల్లే నాజీవితం నాశనమైపోయింది … ప్రభుదేవా మాజీ భార్య ఫైర్…