హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఉడిపోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జోస్యం చెప్పారు. హుజూర్‌నగర్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ గడప గడపకు తిరిగి ఓట్లడిగామని అన్నారు.
రేవంత్, కోమటిరెడ్డి పీసీసీ పదవి కోసం రోడ్ల మీద పడి కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లోని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి హుజూర్‌నగర్ ప్రజలను రెచ్చగొట్టేలా, అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడైన సైదిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని హుజూర్‌నగర్ ప్రజలంతా మనసారా కోరుకుంటున్నారని అన్నారు.
మాయమాటలతో కేసీఆర్ ఐదేళ్లు పాలన: ఎంపీ కోమటిరెడ్డి