telugu navyamedia
సినిమా వార్తలు

‘టక్‌ జగదీష్‌’ ఓటీటీలోనే.. క్లారిటీ ఇచ్చిన నాని

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌‌’. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమాలో రీతూవర్మ,ఐశ్వర్యా రాజేశ్‌ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా విడుదల విషయంలో ఎప్పటి నుంచో సందిగ్ధత కొనసాగుతోంది. తాజాగా దీనిపై నాని స్పష్టత ఇచ్చారు. ఓటీటీలో విడుదల చేయనున్నట్లు చెప్పకనే చెప్పారు. నిర్మాత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇప్పుడిప్పుడే థియేటర్లలో వరుస సినిమాలు విడుదలవుతున్నా, ఏపీలో పూర్తి స్థాయిలో తెరుచుకోని నేపథ్యంలో ‘టక్‌జగదీష్‌’ను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌స్క్రీన్‌ భావించింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. రిలీజ్‌ డేట్‌ తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. జగపతిబాబు, నాజర్‌, రోహిణి, నరేశ్‌, రావు రమేష్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related posts