telugu navyamedia
సినిమా వార్తలు

“పద్మ” ప్రదానోత్సవం… స్పెషల్ అట్రాక్షన్ గా ఇండియన్ మైఖేల్ జాక్సన్

prabhudeva

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా పద్మ అవార్డు స్వీకరించాడు. డ్యాన్సర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రభుదేవా అంచలంచెలుగా ఎదుగుతూ… నటుడుగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ, దర్శకుడిగా సౌత్ తో పాటు బాలీవుడ్ లోను అనేక సినిమాలకు దర్శకత్వం వహించి బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకులలో ఒకరిగా ప్రభుదేవా మంచి గుర్తింపు తెచ్సుకున్నాడు. సినీ రంగానికి ప్రభుదేవా చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మ అవార్డుతో సత్కరించింది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు ప్రభుదేవా.

పద్మ పురస్కారం సందర్భంగా ప్రభుదేవా తన తల్లిదండ్రులు మహాదేవమ్మ, సుందరం మాస్టర్ లతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు వచ్చిన ప్రభుదేవా పంచెకట్టుతో తమిళ సాంప్రదాయ పద్ధతిలో అవార్డును అందుకొని సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రభుదేవాను అభిమానులు ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పిలుచుకుంటానే విషయం తెలిసిందే. ఇక 112 మంది ప్రముఖులు ఈ అవార్డులకు ఎంపిక కాగా… 56 మందికి సోమవారం పురస్కారాలను ప్రదానం చేశారు. మలయాళం స్టార్ మోహన్ లాల్ కు పద్మభూషణ్ ప్రదానం చేశారు. ఇంకా టాలీవుడ్ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, శివమణి, శంకర్ మహదేవన్ లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Related posts