telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విలన్ గా సునీల్ ‘కలర్ ఫొటో’

sunil

కమెడియన్ సునీల్ పుట్టినరోజు సందర్భంగా ‘కలర్ ఫొటో’ సినిమాలో ఆయన లుక్‌ను టీం రిలీజ్ చేసింది. జీపులో స్టైల్‌గా కూర్చుని సీరియస్‌గా కనిపిస్తున్న సునీల్ తన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇందులో ఆయన పేరు ఎస్సై రామరాజు. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ కథానాయకుడిగా నటిస్తు్న్నారు. విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సుహాస్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. నటుడు సందీప్ రాజ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను హృదయ కాలేయం సినిమాకు దర్శకత్వం వహించిన స్టీవెన్‌ శంకర్‌ అలియాస్‌ సాయి రాజేష్, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. చాయ్‌ బిస్కెట్‌ యూట్యూబ్‌చానల్‌ కోసం కలిసి పనిచేసిన సుహాస్, సందీప్‌ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. సుహాస్‌కు జోడిగా ఛాందిని చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత ‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’ సినిమాలతో హీరోగా మారారు. హీరోగానూ మంచి పేరు తెచ్చుకున్నారు కానీ ఆ పొజిషన్‌ను నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు సునీల్ విలన్ పాత్రలతో మెప్పించాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన ‘డిస్కో రాజా’ సినిమాలో విలన్ పాత్రలో నటించారు.. ఇప్పుడు మరోసారి ‘కలర్ ఫొటో’ సినిమాతో తనలోని విలనిజం చూపించబోతున్నారు సునీల్.

Related posts