telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డిసెంబర్ లో రానా పెళ్ళి… క్లారిటీ ఇచ్చిన సురేశ్ బాబు

‘ఆమె ఎస్ చెప్పింది’ అంటూ సినీ నటుడు రానా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మిహీకా బజాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు రానా ప్రకటించాడు. ఈ అంశంపై రానా తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ‘బాంబే టైమ్స్’ తో మాట్లాడుతూ తన కుమారుడి పెళ్లి గురించి సురేశ్ బాబు మాట్లాడారు. రానా, మిహీకా ఒకరికొకరు చాలా కాలంగా తెలుసని సురేశ్ బాబు తెలిపారు. వారిద్దరూ జీవితంలో ఒకటి కావాలనుకోవడం సంతోషకరమని చెప్పారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాలను సరైన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసే అవకాశం ఉందని… అంతకు ముందే కూడా జరగవచ్చని చెప్పారు. అన్ని విషయాలు ఖరారైన తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో తాము బిజీగా ఉండేలా పిల్లలిద్దరూ పని కల్పించారని చెప్పారు. పెళ్లి ప్లానింగ్ లో ప్రస్తుతం తామంతా బిజీగా ఉన్నామని తెలిపారు.

Related posts